భారత్ కు వస్తే… తిరిగి వెళ్లడం కష్టమే!
కరోనా వల్ల అమెరికా యూనివర్సిటీల్లో డ్రాపవట్లు పెరిగాయి. లాక్డౌన్లు, ఆంక్షలకు తోడు ట్రంప్ సర్కారు వీసా నిబంధనలతో కొత్త విద్యార్థులు తగ్గి దిగ్గజ విశ్వవిద్యాలయాలు నష్టపోతున్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. అమెరికా వర్సిటీల్లో కొత్త దరఖాస్తులు 43 శాతం తగ్గాయి. కరోనా, తమ వారి ఆరోగ్యం, విమానాల రద్దు తదితర కారణాలతో స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులు మళ్లీ అమెరికా చేరుకోలేకపోతున్నారు. అమెరికా వర్సిటీలకు ప్రధాన ఆదాయ వనరు విదేశీ విద్యార్థులే. కొత్త అడ్మిషన్లలో మిషిగాన్ (20 శాతం), టెక్సస్ (17 శాతం), అరిజోనా, ఓహియో, మిన్నెసోట వర్సిటీల్లో (15 శాతం) చొప్పున తగ్గుదల నమోదైంది.













