టాక్ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రత్నాకర్ కడుదుల
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడిగా నియమితులైన రత్నాకర్‌కు టాటా వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటివరకు రత్నకర్ వివిధ ప్రవాస సంఘాల్లో పని చేశారని వెల్లడించారు. టాక్ అధ్యక్షుడిగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రవాసులకు అండగా నిలవాలని, సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశించారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమాలతో పాటు స్థానికంగా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.













