రతన్ టాటాకు అరుదైన పురస్కారం
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటాసన్స్ చైర్మన్ రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది. ఆస్ట్రేలియా`భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా గొప్ప వ్యక్తిగా నిలిచారని భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి ఓ ఫారెల్ ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆస్ట్రేలియా` భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.













