తుల్సా ఊచకోత కు నిరసనగా.. అమెరికాలో

తుల్సాలో నల్లజాతీయుల ఊచకోతకు వందేళ్లయిన సందర్భంగా ఆ దారుణ ఘటనను నిరసిస్తూ అమెరికా అంతటా ర్యాలీలు జరిగాయి. అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నల్లజాతీయులు, సాయుధ నిరసనకారులు తుల్సాతో పాటు ఓక్లహోమా పట్టణంలో జరిగిన మార్చ్లో పాల్గొన్నారు. తుల్సా ఉత్తర ప్రాంతంలో సెకండ్ అమెండ్‍మెంట్ మార్చ్ ఫర్ రిపరేషన్స్ పేరుతో జరిగిన ఈ ప్రదర్వనలో వందలాది మంది నిరసనకారులు పారామిలటరీ నలుపు, ఖాకీ రంగు బట్టలు ధరించి ఆయుధాలతో పాల్గొన్నారు. ఎవరి వీధులు? మా వీధులు బ్లాక్ పవర్ అంటూ నినాదాలు చేశారు. ఆ ఊచకోత ఘటనలో బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం కోరుతూ భారీ బ్యానర్లు ప్రదర్శించారు. ప్రశాంతంగా సాగుతున్న ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తుల్సాలో మరో చోట జరుగుతున్న ర్యాలీపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు మరో దఫా ప్రదర్శనకు నిర్ణయించుకున్నారు.