బ్రిటన్ ఎంపీ అభ్యర్థిగా భారత పారిశ్రామికవేత్త
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన ఆంత్రప్రెన్యూర్ రాజేవ్ అగర్వాల్ (46)ను బ్రిటన్లోని లీసెస్టర్ ఈస్ట్ పార్లమెంటరీ అభ్యర్థిగా లేబర్ పార్టీ ఎంపిక చేసింది. రానున్న సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు. దక్షిణాసియా మూలాలుగల జనాభాలో అత్యధికులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. తనను ఎన్నుకుంటే ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేస్తానని ఆయన తెలిపారు. లేబర్ పార్టీలో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భారతీయ మూలాలుగల రిషి మద్లానీని ఓడిరచారు. రాజేశ్ ప్రస్తుతం లండన్ డిప్యూటీ మేయర్ (బిజినెస్)గా ఉన్నారు. ఆయనకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తదితరులు మద్దతుఉన్నది.













