ఈఫిల్ టవర్ కంటే ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎంలతో భేటీ సందర్భంగా ప్రధాని దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్న తీరుపై సమీక్షించనున్నారు. కొవిడ్-19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో సీఎంల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించడంతో పాటు, విలువైన సమాచారాన్ని పంచుకోనున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మదింపు చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహాలో కఠిన నియంత్రణలకు పూనుకున్నాయి. సీఎంలతో సమావేశం నిర్వహిస్తుండటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యాయరు. ఆ తర్వాత మార్చి 17న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు మోదీ.













