బ్రిటన్ రాణి లేఖపై సస్పెన్స్ .. తెలుసుకోవాలంటే 2085 వరకు
దివంగత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ రాసిన ఓ లేఖను అత్యంత రహస్యంగా భద్రపరిచారు. 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాసిన ఆ లేఖలో ఏముందో తెలుసుకోవాలంటే 2085 వరకు ఆగాల్సిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్వీన్ విక్టోరియా బిల్డింగ్ లోని ఓ భోషాణంలో ఆ లేఖను దాచిపెట్టారు. రాణి వ్యక్తిగత సిబ్బందికి సైతం లేఖలో ఏముందో తెలియదట. ఆ లేఖను ఎప్పుడు తెరవాలో తెలియజేస్తూ ఆమె సిడ్నీ మేయర్‌కు లేఖ రాశారు. 2085లో మేయర్ ఎంపిక చేసిన తేదీన, ఎంపిక చేసిన పిడికెడు మంది సమక్షంలో లేఖను తెరవాలని ఎలిజబెత్ సూచించారు.













