ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీషియేటివ్స్ (ఏఎస్ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితం గా ఆకర్శిస్తోందని తెలిపారు.













