అధ్యక్ష బరిలో ఈసారి … స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్!
గత రెండు దశాబ్దాలుగా రష్యా పై ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి అధ్యక్ష ఎన్నికలకు సై అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు అధికార యునైటెడ్ రష్యా పార్టీ ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచారు. ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ సీనియర్ అధికారి ఆండ్రీ పేర్కొన్నారు.













