ఆ నాలుగు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది
ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యా ఇటీవల తమ దేశంలో ఏపక్షంగా విలీనం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. కొత్త ముప్పులను ఎదుర్కొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లట్లేదన్న ప్రచారం జరుగుతోన్న సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.













