రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ ఇకలేరు
రష్యా అధ్యక్షుడు పుతిన్ బద్ధశత్రువు, ప్రభుత్వ అవినీతిపై ఉద్యమించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో మరణించినట్లు ప్రిజన్ సర్వీస్ తెలిపింది. జైలులో కొంతసేపు నడిచిన తర్వాత ఆయన అస్వస్థతకు గురై స్పృహకోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించారు. అయితే ఆయనను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణించారని వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. ఆయన మృతికి కారణాలు తెలియ్సా ఉందని ఆ ప్రకటన వివరించింది. నావల్నీ తీవ్రవాద అభియోగాలతో పాటు పలు కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నావల్నీ మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది. కాగా, 2020 సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నావల్నీపై విషప్రయోగం జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది.













