పుతిన్‌తో పెట్టుకుంటే అంతే..?
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.. మృతిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు బైడన్ స్పందించారు. ఇది ముందుగానే ఊహించిందన్నారు. ఇందులో విచిత్రమేముందన్నారు. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన సమయంలోనే ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని కామెంట్ చేశారు బైడన్. మరోవైపు.. ప్రిగోజిన్ మృతి కాస్త ఆలస్యమైందన్నారు ఎలన్ మస్క్. ఇంత సమయం పడుతుందని అనుకోలేదన్నారు. పుతిన్ తనకు వ్యతిరేకంగా పనిచేసేవారిని అస్సలు క్షమించరని.. పలువురు పాశ్చాత్య నిపుణులు తెలిపారు. ఇది కూడా ఆలాంటిదేనని వారు అభిప్రాయపడుతున్నారు.













