అమెరికాలో పంజాబ్ యువకుడ్ని…
అమెరికాలో కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడ్ని ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్జియాలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్‌సింగ్, అమెరికాలోని జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆఫ్రికా జాతీయుడైన ఒక వ్యక్తి పట్టపగలు తుపాకీతో ఆ షాప్‌లోకి ప్రవేశించాడు. పరమ్‌వీర్ సింగ్‌ను బెదిరించి డబ్బులు దోపీడి చేశాడు. అనంతరం అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కంప్యూటర్ పరికరాలను కూడా ఎత్తుకెళ్లాడు. కాగా, ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్‌వీర్ సింగ్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్‌ను అరెస్ట్ చేశారు. పరమ్‌వీర్ సింగ్ మృతదేహం పంజాబ్‌లోని సొంత గ్రామమైన ధాపై చేరుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఒక్కడే కుమారుడైన పరమ్‌వీర్ సింగ్ మరణాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు.













