షెంజెన్ వీసా ఇక 8 వారాల్లోనే
జర్మనీలో పర్యటించేందుకు అవసరమైన షెంజెన్ వీసాకు వేచి చూసే కాలం ఇప్పుడు 8 వారాలకు తగ్గిందని భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ జార్జ్ ఎన్జ్వీలర్ తెలిపారు. మున్ముందు మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. వీసా జారీ అనేది చాలా కీలక అంశంగా మారింది. దరఖాస్తును వేగంగా చూసేందుకు, త్వరగా జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకు మా ముంబై కార్యాలయంలో సిబ్బందిని కూడా గణనీయంగా పెంచాం అని ఆయన స్పష్టం చేశారు. 27 ఐరోపా దేశాల్లో పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం పర్యటించాలనుకునే వారికి 90 రోజుల వ్యవధి కలిగిన షెంజెన్ వీసాను జారీ చేస్తారు.













