రికార్డులు బ్రేక్ చేస్తోన్న ప్రిన్స్ హ్యారీ స్పేర్.. తొలిరోజే 4 లక్షలు
బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం స్పేర్ అమ్మకాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. తొలిరోజే 4 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేశారు. హార్డ్ కాపీతో పాటు, ఈ`బుక్, ఆడియో ఫార్మాట్లు కూడా కలిపి తొలిరోజే నాలుగు లక్షల కాపీలు అమ్ముడయ్యాయని బ్రిటన్‌లోని పబ్లిషింగ్ సంస్థ ట్రాన్స్‌వరల్డ్ పెన్ గ్విన్ రాండం హౌస్ తెలిపింది. అత్యంత వేగంగా అమ్ముడుపోయిన నాన్- ఫిక్షన్ పుస్తకంగా ఇది నిలిచిందని పేర్కొంది.













