రాజకుటుంబం నుంచి వచ్చి… అమెరికాలో

బ్రిటన్ రాజకుటుంబంలో ఉండే కష్టాలు, బాధలు భరించలేకే ఆ వలయం నుంచి బైటపడ్డానని యువరాజు హ్యారీ చెప్పారు. తండ్రి యువరాజు చార్లెస్ కుటుంబంలోని వారందరూ తనను ఎలా చూశారో నన్ను అలాగే చూశారు అని పేర్కొన్నారు. రాజకుటుంబంలో జాతివివక్ష ఉన్నాయని హ్యారీ, మేఘన్ మర్కెల్ దంపతులు సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన తండ్రి తమకు వచ్చే నిధులను కూడా ఆపించారని హ్యారీ తెలిపారు. ఆయన లాగా నా పిల్లలను పెంచొద్దని అనుకుంటున్నాను అని తెలిపారు. ఈ వలయాన్ని ఛేధించేందుకు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి అమెరికాలో స్థిరపడ్డానని వివరించారు. తన తండ్రి కూడా రాజకుటుంబపు ఇబ్బందులతోనే పెరిగారని పేర్కొన్నారు.