సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ
లండన్ ప్రిన్స్ హ్యారీ ఈ నెల 10న విడుదల చేయనున్న తన ఆత్మకథ స్పేర్‌లో సంచలన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా తాను రాచరికాన్ని వదులుకుని, 2018లో సినీనటి అయిన మేఘన్ మెర్కెల్‌ను పెళ్లాడిన విషయం మొదలు, ఆమె కోసం రాచకుటుంబంలో వివాదలు, ఇలా ఇంతవరకు బయటి ప్రపంచానికి తెలియని వివరాలను వెల్లడించారని ద గార్డియన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మేఘన్ విషయంలో ప్రిన్స్ విలియం నాతో ఎప్పుడూ విభేదించేవాడు. ఆమె మొరటు మనిషి అంటూ రెచ్చగొట్టేవాడు. రాచకుటుంబానికి తగినది కాదని చెప్పేవాడు. ఈ క్రమంలో 2019లో ఓ సారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విలియం నా గల్లాపట్టుకుని, బలంగా కిందకు తోసేశాడు. ఇంట్లో కుక్కకు అన్నం పెట్టే గిన్నెపై వెల్లకిల్లా పడ్డాను. ఆ గిన్నె పగిలిపోయి నా వెన్నుకు గాయమైంది. నన్ను లేపడానికి లియం ప్రయత్నించలేదు. అని హ్యారీ తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే తాను మేఘన్ 2008లో అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలిపారు.













