PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
ఇథియోపియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి (PM Modi) ఆ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ని ప్రదానం చేశారు. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ ఈ పురస్కారాన్ని స్వయంగా ప్రధాని మోడీకి బహూకరించారు.
ఈ సందర్భంగా ఇథియోపియా ప్రధాని అహ్మద్ మాట్లాడుతూ.. భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని శక్తిమంతం చేయడంలో మోడీ (PM Modi) చేసిన అసాధారణ సేవను, ప్రపంచ రాజకీయాల్లో ఆయన దార్శనికతను గుర్తిస్తూ ఈ పురస్కారం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో గర్వకారణమని, దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్టు ప్రధాని మోడీ (PM Modi) చెప్పారు. జోర్డాన్ పర్యటన తరువాత ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇథియోపియా ప్రధాని అహ్మద్ స్వయంగా వచ్చి ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు.






