జో బైడెన్ – జిన్‌పింగ్ మధ్య చర్చలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్లో సుదీర్ఘంగా వాడీవేడిగా సంభాషణలు సాగాయి. రెండు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన ఐదో విడత చర్చలు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ చర్చల్లో తైవాన్ అంశమే ప్రధానంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణతకు అమెరికానే కారణమంటూ ఎప్పటి మాదిరిగానే చైనా నిందించింది. తైవాన్ ఎప్పటికైనా తమదేనంటూ చర్చల సందర్భంగా జిన్‌పింగ్ గట్టిగా చెప్పారని చైనా పేర్కొంది. నిప్పుతో ఆడుకునే వారు దానివల్లే నాశమవుతారు. ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
అమెరికా`చైనా సంబంధాలను వ్యూహాత్మక పోటీదారు కోణంలో చూడటం, చైనాను ప్రధాన ప్రత్యర్థిగా భావించడం వంటి వాటిని బైడెన్‌తో జిన్‌పింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి విధానం అంతర్జాతీయ సమాజాన్ని, రెండు దేశాల ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇరు దేశాల సబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జిన్‌పింగ్ అన్నారు అని విదేశాంగ శాఖ తెలిపింది.













