క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ నెల 19న లండన్లో నిర్వహించతలపెట్టిన ఎలిజబెత్ అంత్యక్రియలకు దేశం తరపున రాష్ట్రపతి హాజరై నివాళులు అర్పించనున్నారు. సెప్టెంబర్ 17`19 తేదీల్లో లండన్లో క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
క్వీన్ ఎలిజబెత్-2 70 ఏళ్ల పరిపాలనలో భారత్-యూకే బంధం ఎంతో బలపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో అభివృద్ధి చెందాయి. కామన్వెల్త్ అధినేతగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల సంక్షేమంలో ఆమె కీలక పాత్ర పోషించారు అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.













