దాన్ని వెంటనే ఆపాలి : పోప్
ఉక్రెయిన్ యుద్ధం అవివేకమని, దాన్ని వెంటనే ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా నుంచి సంప్రదాయ క్రిస్మస్ సందేశంలో ఆయన ఉక్రెయిన్ యుద్దం గురించి ప్రస్తావించారు. 10 నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. ఆహారాన్ని ఆయుధంగా వాడటం మానుకోవాలి. ఈ క్రిస్మస్ను చీకటి, చలిలో జరుపుకొంటున్న మన ఉక్రెయిన్ సోదర సోదరీమణులకు అండగా నిలిచేలా భగవంతుడు మనలో స్ఫూర్తిని రగలించాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఈ అవివేకమైన యుద్ధాన్ని ఆపేశక్తి ఉన్న వారి మనసుల్లో ఆలోచనను కలిగించాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.













