భారతీయుల తరలింపుపై.. పుతిన్ కు మోదీ ఫోన్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో ముఖ్యంగా చాలామంది భారతీయులు చిక్కుపడిన ఖార్కివ్‌లో పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులను క్షేమంగా తీసుకువచ్చే విషయమై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజుల్లో బుఖారెస్ట్ నుంచి 3,500 మంది, సుసీవా నుంచి మరో 1300 మంది భారతీయులు స్వదేశానికి బయలుదేరుతారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.తాను సిరాటె సరిహద్దు ప్రాంతానికి వెళుతున్నానని, అక్కడి నుంచి భారతీయులందరినీ తరలించే దాకా తాను అక్కడే ఉంటానని, అక్కడి నుంచి మొత్తం భారతీయులంతా క్షేమంగా వెళ్లే దాకా చూస్తామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరకునేలా చూడడం కోసం సింధియా బుఖారెస్ట్ వెళ్లిన విషయం తెలిసిందే.













