12 ఏళ్లలో తొలిసారిగా… ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్నారు. ప్రధాని లియోనార్డో దావిన్సీ ఎయిర్‌పోర్టులో దిగారు. నేడు, రేపు రోమ్‌లో నిర్వహించనున్న 16వ జీ20 నేతల సదస్సులో మోదీ పాల్గొననున్నారు. 12 ఏళ్లలో రోమ్కు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. ఈ విషయాన్ని ఇటలీకి భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. టూర్లో భాగంగా ఆయన నేడు మధ్నాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రోమ్‌లోని గాంధీ విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం 5:30 గంటలకు ఇటలీ ప్రధాని మారియో డ్రాఫీుతో ఇరు దేశాల సంబంధాలపై చర్చిస్తారు. పోప్ ప్రాన్సిస్‌ను మోదీ కలుస్తారు. కాగా జీ20 సదస్సు పూర్తి కాగానే వెంటనే ఆయన స్కాట్లండ్‌లోని గ్లాస్గో వెళతారు. వచ్చే నెల ఒకటి, రెండో తేదీల్లో పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆప్ పార్టీస్ (కాప్-26) సదస్సులో మోదీ పాల్గొంటారు.













