మొజాంబిక్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
మొజాంబిక్ అధ్యక్షుడు పిలిఫ్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తదితర అంశాలపై వారు చర్చించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంబ్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మొజాంబిక్ గుజరాత్‌కు వచ్చాడు. మూడు రోజులపాటు ఈ వైబ్రాంట్ గుజరాత్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్‌ను అతిథిగా ఆహ్వానించారు. ఈ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల్లోని పలు కంపెనీల సీఈవోలు హాజరుకానున్నారు.













