జర్మనీ ఛాన్సలర్ తో ప్రధాని మోదీ చర్చలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సరల్ ఒలాఫ్ స్కోల్జ్‌తో భేటీ అయ్యారు. కీలక ద్వైపాక్షిక సహకార అంశాలు ప్రధానంగా వీరిరువురి నడుమ చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఇమిడి ఉన్న సమగ్రవ్యూహాత్మక భాగస్వామ్యం కోణంలో ఈ చర్చలు జరిగాయి. ప్రాంతీయ, ప్రపంచస్తాయి పరిణామాలను సమీక్షించారు. మూడు దేశాలపర్యటనలొ తొలిదశగా ప్రధాని మోదీ బెర్లిన్ చేరుకున్నారు. బెర్లిన్ లోని అధ్యక్ష భవనం వద్ద ప్రధాని మోదీకి దేశాధ్యక్షులు స్వాగతం పలికారు. తరువాత ఇరువురు నేతలు ముఖాముఖిగా భేటీ జరిపారు. తరువాత ఇరుదేశాల ప్రతినిధి బృందాల మధ్య సంప్రదింపులు సాగాయి.













