ఆయన స్వరం ప్రపంచ వేదికపై ప్రభావం : యూకే
మోదీ మాట శక్తిమంతమైనదని, ఆయన స్వరం ప్రపంచ వేదికపై ప్రభావం చూపుతుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. ఉజ్జెకిస్థాన్లోని జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో మోదీ పుతిన్‌తో మాట్లాడుతూ ఇది యుద్ధాల యుగం కాదు అన్నారు. మోదీ జోక్యాన్ని స్వాగతిస్తున్నాం. ఉక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ వైఖరిని గౌరవిస్తున్న పుతిన్, శాంతిని స్థాపించాలన్న స్వరాలను కూడా వింటారని భావిస్తున్నా అని క్లెవరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది యుద్దాల యుగం కాదని పుతిన్‌తో మోదీ చెప్పడం పట్ల అమెరికా రక్షణశాఖ కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది.













