అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీనే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లీడర్‌గా నిలిచారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మోదీ, ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల టాప్-50 జాబితాలో అగ్రపథాన నిలిచారు. 2021 సంవత్సరానికి గాను అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తర్వాత రెండవస్థానంలో నిలిచారు. ఈ వార్షిక సర్వేను వినియోగదారుల ఇంటెలిజెన్స్ కంపెనీ బ్రాండ్‌వాచ్ రూపొందించింది. ఈ సర్వేలో 7.2 కోట్ల మంది ఫాలోవర్లతో మోదీ నవంబర్ 2 స్థానం దక్కించుకున్నారు. ట్విట్టర్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య గతేడాది కూడా ఇంచుమించు ఇదేవిధంగా ఉంది.
ప్రధాని మోదీతో పాటు మాస్టర్ బాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా టాప్-50 వ్యక్తులతో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. అమెరికా నటులు డ్వేన్ జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, యూఎన్ మాజీ ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాల కంటే సచిన్ ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో సచిన్‌కు 35వ ర్యాంకు లభించింది.













