ఫ్లోరిడాలో కూలిన విమానం
అమెరికాలోని ఫ్లోరిడా నివాస సముదాయాల్లో ఓ ఇంటిపై చిన్న విమానం కూలింది. ఈ ఘటనలో సదరు నివాస భవనం పూర్తిగా దగ్ధమవగా, పొరుగున్న ఉన్న మరో మూడిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో పైలట్‌తో సహా విమాన ప్రయాణికులు, ఇంటిలో నివాసితులు మరణించారు. మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు. క్లియర్‌వాటర్ ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం అధికారికంగా ప్రకటించింది. విమానం కూలడం, ఆ ప్రాంతంలో మంటలు చెలరేగడం, ముక్కలైన విమాన అవశేషాలు స్పష్టంగా కనపించాయి. బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా వి35 అనే విమానం సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తోంది.













