ఆకాశంలో ఎగిరే వస్తువు….
పాకిస్థాన్‌కు చెందిన ఒక విమాన పైలట్ ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును (యూఎఫ్‌వో) గుర్తించారు. ఈ నెల 23న పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానాన్ని లాహోర్ నుంచి కరాచీకి నడుపుతుండగా రహిమ్ యార్ ఖాన్ ప్రాంతంపై గగనతలంలో ప్రకాశవంతమైన ఒక వస్తువు ఆయనకు కనిపించింది. ఈ విషయాన్ని ఆయన కంట్రోల్ రూమ్‌కు తెలిపారు. విమాన పైలట్‌తో పాటు రహిమ్ యార్ ఖాన్ ప్రాంత వాసులు కూడా దీనిని చూశారు. కొందరు తమ మొబైల్స్ తో వీడియో కూడా తీశారు.
ఈనెల 23న సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహిమ్ యార్ ఖాన్ ప్రాంతంపై ఆకాశంలో భారీ సైజులో యూఎఫ్‌వోను గుర్తించడం చాలా అరుదని కొన్ని వర్గాలు తెలిపాయి. ఇది స్పేస్ స్టేషన్ లేదా శాటిలైట్ కావచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఏమిటన్నది ఖచ్చితంగా చెప్పలేమని, గుర్తు తెలియని ఎగిరే వస్తువును గుర్తించడం నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు రిపోర్టు చేసినట్లు వెల్లడించారు.













