తైవాన్ లో అడుగుపెట్టిన పెలోసీ
తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. తైవాన్ భూభాగంలో అడుగుపెడితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న డ్రాగన్ హెచ్చరికలను బేఖాతారు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ పరిణామాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. తైవాన్ అంశంలో కొందరు అమెరికన్ రాజకీయ నాయులు నిప్పుతో చెలగాటం అడుతున్నారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మండిపడ్డారు. తన పర్యటన తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతున్నదని పెలోసీ పేర్కొన్నారు.













