ఆరో పెండ్లి.. ఈసారి బాడీగార్డ్ తో
మాజీ నటి, ప్లేబాయ్ మోడల్ పమేలా అండర్సన్ తన బాడీగార్డ్ డాన్ హేరస్ట్ ను వివాహం చేసుకున్నారు. గత ఏడాది క్రిస్మస్ రోజు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైందని పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇది పమేలా ఆరో వివాహం కావడం గమనార్హం. తొలుత ఆమె 1995లో టామీ లీని పెండ్లాడి అతడితో ఇద్దరు పిల్లల్ని కన్నారు. వారు 1998లో విడిపోగా 2006లో పమేలా సింగర్ కిడ్ రాక్తో ఏడడుగులు నడిచారు. ఆ తర్వాత సంవత్సరమే వారిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక 2007లో రిక్ సాల్మన్‌ను పెండ్లాడిన పమేలా మరుసటి సంవత్సరమే ఆయనకు విడాకులిచ్చారు. 2014లో వారిద్దరూ మరోసారి పెండ్లి చేసుకోని మరుసటి ఏడాదే మరో దారి చూసుకున్నారు. ఇక 2020లో పమేలా జాన్ పీటర్స్‌ను పెండ్లాడి 12 రోజులకే ఆయనతో విడిపోయారున. వికీలీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజేతోనూ పమేలాకు సంబంధాలున్నాయని ప్రచారం సాగింది.













