పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాబ్ షరీఫ్
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (70) ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఇంతకు ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో పదవీచ్యుతుడయ్యాడు. ఆ తర్వాత కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు పీటీఐ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్ ఖురేషి ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది.













