పాకిస్థాన్ కుటుంబం గిన్నిస్ రికార్డు …ఒకే తేదీన 9 మంది
పాకిస్థాన్లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది. సింధ్ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం. ఇలా ఏడుగురు తోబుట్టువల్ల పుట్టినరోజు ఒకే తేదీగా రాగా, అమీర్, ఖదీజా దంతపుల పుట్టినరోజు, పెళ్లి రోజు సైతం అదే తేదీ కావడంతో ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో భారీ సంబరాలే. ఈ పాకిస్థానీ కుటుంబం గిన్నిస్ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో ఈగిన్నిస్ రికార్డు ఉండేది.













