అమెరికాపై పాక్ ప్రధాని ధ్వజం

అమెరికాపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకొనేందుకు పాకిస్థాన్‌కు ఉపయోగించుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టేయడం, పైగా ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిపోయిందని అన్నారు. మిత్ర దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రసుత్త పరీక్షా సమయంలో చైనా తమను ఆదుకుంటోందని అన్నారు.
గతంలో అమెరికాతో పాకిస్థాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు పాక్ అవసరం లేదని అమెరికా భావిస్తోందని, అందుకే దూరం పెడుతోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడల్లా మళ్లీ తమ దేశానికి దగ్గర కావడం అగ్రరాజ్యం విధానమని అన్నారు. అవసరం తీరాక తమ మైపు కన్నెత్తి కూడా చూడదని ఆక్షేపించారు.