జో బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన పాక్ ప్రధాని
పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఖండించారు. పాక్‌ను అత్యంత ప్రమాదకర దేశంగా బైడెన్ అభివర్ణించారు. దీనిపై స్పందించన షరీఫ్ ఈ వ్యాఖ్యలు సత్యదూరమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యాంగా నిరూపితమైంది. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది అని పాక్ ప్రధాని పేర్కొన్నారు. పాకిస్థాన్, అమెరికా ఎంతో కాలంగా స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకర సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాక్ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి, మన్నికైన ప్రయతాలు చేయాలి. అంతే తప్ప పాక్ అమెరికా సంబంధంపై అవసరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. శాంతి, భద్రతలను పెంపొందించడానికి యూఎస్‌తో సహకరించాలనేది మా కోరిక అని షరీప్ అన్నారు.













