భారత్ విదేశాంగ విధానంపై…పాక్ ప్రశంసలు
ప్రపంచ సంక్షోభ సమయంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. అమెరికా ఆంక్షలున్నా రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతి చేసుకుందని గుర్తు చేశారు. మొదటి నుంచి మోదీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించే ఇమ్రాన్ తాజాగా భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించడం గమనార్హం. ఖైబర్ ప్రావిన్సులో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. క్వాడ్‌లో భాగమై ఉండి కూడా రష్యాతో భారత్ సత్సంధాలు నెరవుతోందన్నారు. తాను కూడా ఎవరికీ లొంగే వ్యక్తిని కాదని, పాక్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానాలుంటాయని చెప్పుకొచ్చారు. రష్యాకు వ్యతిరేకించాలన్న యూరోపియన్ యూనియన్ పిలుపు తిరస్కరించాలని తెలిపారు.













