చివరి బాల్ వరకు ఆట.. మధ్యలో వెళ్లేది లేదు
తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి వరకు ఆడుతూనే ఉంటారని, మధ్యలో వెనకకు వెళ్లేది లేదని పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు. అవిశ్వాసం, నిధుల గోల్మాల్లతో చిక్కుల్లో పడ్డ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ భవిత ప్రశ్నార్థకంలో ఉంది. ఈ దిశలో మంత్రి ఈ విధంగా స్పందించారు. ఇమ్రాన్ పార్లమెంట్లో ఓటింగ్‌కు ముందే రాజీనామాకు దిగుతారనే వార్తలను మంత్రి తోసిపుచ్చారు. అటువంటిదేమీ లేదన్నారు. క్రికెటర్‌గా ఇమ్రాన్ పటిమ ఏమిటనేది అందరికి తెలిసిందే. ఆయన వికెట్ చాలా గటిది. చివరి బంతివరకూ జట్టు విజయానికి పాటుపడుతారని తెలిపారు. మ్యాచ్ సాగుతుంది. ఇమ్రాన్ ఆటను ఆయన దోస్తులు దుష్మన్లు అంతా చూడవచ్చు అని తెలిపారు.













