ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి ఎన్నికల ట్రిబ్యునల్ నిషేధం వేటు వేసింది. ఆయన 2018`2022 మధ్య కాలంలో ప్రధానమంత్రిగా వ్యవహరించినప్పుడు వివిధ దేశాల్లో పర్యటన సందర్భంగా తనకు వచ్చిన కానుకలను అమ్మడమో, ఇతరులకు బహుమతులుగా ఇవ్వడమో చేసి నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఆయనపై నిషేధం విధిస్తున్నట్టు ట్రిబ్యూనల్ పేర్కొంది. ఈ కానుకల విలువ 635 డాలర్లు. పాకిస్తాన్ కరెన్సీలో 140 మిలియన్ రూపాయిలు. అయితే తనపై వచ్చిన ఆరోపనలను ఇమ్రాన్ ఖాన్ ఖండిరచారు. అయితే, ఇమ్రాన్‌పై నిషేధం ఎంత కాలం అమలులో ఉంటుందో ట్రిబ్యునల్ ప్రకటించలేదు.













