సరైన నిర్ణయాలు తీసుకోకపోతే.. దేశం మూడు ముక్కలు
పాక్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశం మూడు ముక్కలవడం ఖాయమంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత తన ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, బలూచిస్థాన్‌ను ఆక్రమించాలని చూస్తోందని అన్నారు. పాక్ ముక్కలైతే ఉక్రెయిన్ నుంచి అంతర్జాతీయ సమాజం అణ్వాయుధాలు లాక్కున్నట్లే, పాక్ నుంచి లాగేసుకుంటారని పేర్కొన్నారు. ప్రధానిగా తాను పూర్తిస్థాయిలో అధికారం అనుభవించలేదని, తనను ప్రతి ఒక్కరూ బ్లాక్ మెయిల్ చేశారని వెల్లడించారు. పాక్‌లో అధికార కేంద్రం ఎక్కడుందో అందరికీ తెలుసనని పరోక్షంగా సైన్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.













