అమెరికాలో 2,600 విమానాల రద్దు
అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా దాదాపు 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో పాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం ఈశాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా, వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూఆర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నాయి. దీంతోపాటు జూన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ ఎయిర్ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా, 426 సర్వీసులు నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా, 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్ చేసుకోవాలని పలు విమానయాన సంస్థలు సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి.













