అగ్రరాజ్యం నుంచి భారత్‍కు.. 3,667 కోట్ల సాయం

భారత్‍కు అగ్రరాజ్యం అమెరికా భూరి సాయం అందిస్తోంది. కొవిడ్ కేసులు, మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్‍కు 15 రోజుల్లోనే సుమారు రూ.3,667 కోట్ల సాయం అందించింది. ఆ దేశ ప్రభుత్వం, వివిధ సంస్థలు, కార్పొరేట్ వర్గాలు అందించిన విరాళాలు ఇందులో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అగ్రరాజ్యం నుంచి భారత్‍కు అందే సాయం విలువ ఒక బిలియన్ డాలర్లు దాటే అవకాశముందని తెలుస్తోంది. మహమ్మారిని ఎదుర్కొనే విషయమై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిన 15 రోజులు కాకముందే ఆ దేశం నుంచి ఇప్పటి వరకు అర బిలియన్ డాలర్ల విలువైన వైద్య పరికరాలు, సామాగ్రి భారత్‍కు అందింది. బైడెన్ హామీ ఇచ్చిన 100 మిలియన్ డాలర్ల సాయంలో ఫైజర్ నుంచి 70 మిలియన్ డాలర్ల విలువైన 4.5 లక్షల టీకా డోసులు కూడా ఉన్నాయి.