ఈ ఏడాది 60 వేల మందికే అవకాశం … సౌదీ

వచ్చే నెల హజ్ యాత్ర ప్రారంభం కానుంది. 2021 ఏడాదికి సంబంధించిన సౌదీ అరేబియా హజ్ విధానాన్ని ప్రకటించింది. హజ్ యాత్రలో ఈసారి కేవలం సౌదీ అరేబియాలో నివసించే ప్రజలే పాల్గొంటారని తెలిపింది. హజ్ యాత్రకు ఈ ఏడాది 60 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ఏడాది కూడా హజ్ యాత్రకు విదేశీ యాత్రికులకు సౌదీ నిరాకరించింది.