అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా…100 కోట్ల డాలర్ల
అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన నకిలీ వస్తువులు పట్టుబడ్డాయని న్యూయార్క్ అధికారులు వెల్లడించారు. వాటిలో హ్యాండ్ బ్యాగ్స్, షూస్, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. జనవరి నుంచి అక్టోబరు వరకు న్యూయార్క్ సిటీ స్టోరేజ్, ఇతర ప్రదేశాల నుంచి అక్రమ రవాణా చేసినందుకు ఇద్దరి వ్యక్తులపై అభియోగాలు మోపారు. అమెరికా చరిత్రలోనే పట్టుబడిన నకివీ వస్తువుల వ్యవహారాలలో ఇదే అతిపెద్దది అని యూఎస్ అటార్నీ డామియన్ విల్లియమ్స్ అన్నారు. ఈ కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు దోషులుగా తేలితే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడిరచారు.













