న్యూజెర్సిలో ఎన్నారై దేవెందర్ రెడ్డి నల్లమడ మృతి…మహేష్ బిగాల సంతాపం
నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండకు చెందిన (ఎన్ఆర్ఐ) దేవేందర్ రెడ్డి నల్లమడ న్యూజెర్సీలోని ఎడిసన్‌లో డిసెంబర్ 29వ తేదీన మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కారుకు నిప్పంటుకోవడంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దేవేందర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితికి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే దేవేందర్ రెడ్డి మృతి పట్ల పలువురు ఎన్నారైలు సంతాపం తెలిపారు.
మహేష్ బిగాల సంతాపం
దేవేందర్ రెడ్డి నల్లమడ మృతి పట్ల టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలోని ఆయన భార్య అనురాధ తో మరియు కుటుంబ సభ్యులు యుగంధర్ తో మాట్లాడి సంతాపం తెలియ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఎమ్మెల్సీ, తెరాస ఎన్నారై సలహాదారు కవితగారి దృష్టికి కూడా తీసుకు వెళ్లానని తెలిపారు. అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక ప్రతినిధి. అందరికి చేదోడు వాదోడుగా ఉండేవాడు, నాకు ప్రత్యేకంగా ఆయనతో చాల అనుబంధం ఉంది, ఏ కార్యక్రమానికి అయినా అన్నింటి లో చురుకుగా పాలు పంచుకొనేవాడు అని గుర్తు చేశారు.













