భారత పర్యాటకులకు వీసా ఫ్రీ
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, గల్ఫ్ ప్రాంతం సహా 33 దేశాల పర్యాటకులు వీసా అవసరం లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే తుర్కియే, అజర్బైజాన్, ఒమన్, చైనా, అర్మేనియా, లెబనాన్, సిరియా దేశాల పర్యాటలకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్లో పర్యటించే అవకాశమున్న దేశాల సంఖ్య 45కి చేరింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం పట్ల ఇరాన్ వైఖరికి నిదర్శమని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఇరాన్ ప్రభుత్వం 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను సడలించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.













