భారత్ కు, అమెరికాకు .. నేనెప్పుడూ వ్యతిరేకం కాదు
తాను ఏ దేశానికీ వ్యతిరేకం కాదని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనను దించేయడం వెనుక విదేశీ కుట్ర ఉందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్ కీలఖ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక తన బలాన్ని చూపించుకునేందుకు కరాచీలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ తాను భారత్ కు గానీ, అమెరికా, యూరప్‌కు గానీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను మానవతావాదినన్నారు. తాను ఏ దేశానికీ, ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాగా ప్రధాని పదవిలో ఉన్నప్పుడు భారత్‌పై తరచూ విమర్శలు గుప్పించిన ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు పొగడడం మొదలు పెట్టారు.













