ప్రధానికి భారీ ఫైన్ వేసిన పోలీసులు… ఎందుకంటే
నార్వే దేశ ప్రధాని ఎర్నా స్లోబర్గ్ కు భారీ ఫైన్ వేశారు పోలీసులు. ఎందుకంటే ఆమె కోవిడ్ రూల్స్ ని బ్రేక్ చేశారు. కరోనా నేపథ్యంలో నార్వే ప్రభుత్వం కోవిడ్ రూల్స్‌ని కఠినంగా అమలు చేస్తోంది. పార్టీలు, వేడుకలకు షరతులతో కూడిన అనుమతి ఇస్తోంది. అయితే నార్వే ప్రధాని ఎర్నా స్లోబర్గ్ తన 60వ పుట్టినరోజుని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది. పార్టీలు, వేడుకల్లో 10 మందికి మించి ఉండకూడదన్న రూల్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తూ ఆవిడ బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ప్రధాని ఎర్నా బర్త్ డేకి 13 మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసిన కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ 20 వేల నార్వేజియన్ క్రౌన్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 2 లక్షల రూపాయల ఫైన్ వేశారు.













