ఐదు నెలల తర్వాత మళ్లీ… ప్రజల్లోకి కిమ్ సతీమణి
ఉత్తరకొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్ సతీమణి రిసాల్జూ మొట్టమొదటి సారి బాహ్యప్రపంచంలోకి వచ్చింది. ప్రభుత్వ మీడియాలో తొలిసారి ఆమె కనిపించింది. సుమారు ఐదునెలల తర్వాత ఆమె మొదటిసారిగా మీడియాకు దర్శనమిచ్చినట్లు తెలిసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కిమ్ కుటుంబం అత్యంత అరుదుగా మాత్రమే బైటకు వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. కిమ్ రిసాల్జూ ఇరువురూ కలిసి రాజధాని ప్యాంగ్యాంగ్లో చంద్రమాన సంవత్సర శెలవుదినం వేడుకల్లో అధికారికంగా పాల్గొన్నారు. మాన్సుడే ఆర్ట్ థియేటర్లో జరిగిన ఈ వేడుకల్లో కిమ్ దంపతులిరువురూ మొట్టమొదటిసారి కనిపించారు.
గత ఏడాది సెప్టెంబరులో మాత్రమే ఆమె కనిపించారు. కిమ్ తాత, తండ్రుల సమాధుల ఉన్న కమునుసన్పేలస్లో జరిగిన కార్యక్రమాల్లో చివరి సారిగా కనిపించారు. కిమ్ దంపతులిరువురూ రాగానే ఆడిటోరియంలో స్వాగత సంగీతం హోరెత్తింది. హుర్రే అంటూ ప్రేక్షకులు నినాదాలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.













