కిమ్ ఎక్కడ? ఆరోగ్యంపై వదంతులు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ 40 రోజుల నుంచి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవాల సందర్భంగా రెండు మూడు రోజుల్లో పరేడ్ జరగనుంది. ఉత్తర కొరియా తయారు చేసిన ట్యాంకులు, క్షిపణులను ఈ పరేడ్లో ప్రదర్శించనున్నారు. కిమ్ ఈ పరేడ్కి హాజరు అవుతారా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, మిలటరీ కమిషన్ సమావేశానికి కిమ్ అధ్యక్షత వహించినట్టు తెలిసింది. కానీ, ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రచురితం కాలేదు. కీలక రాజకీయ అంశాలపై ఆయన చర్చించినట్టు యుద్ద సన్నద్ధతను పెంచుకోవాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.













