అదే జరిగితే మాపై యుద్ధం ప్రకటించినట్లే…
ఉత్తరకొరియా మరోసారి అమెరికా కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త యుద్ధవిన్యాసాలను ప్యాంగ్యాంగ్ తప్పుబట్టింది. ఈ మేరకు ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ సోదరి, దేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ప్యాంగ్యాంగ్ వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ద ప్రకటనగా భావిస్తామని పేర్కొంది.













